సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి ఆర్టీసి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 700 బస్సు సర్వీసులు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గత రెండేళ్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా 2200 బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసి ఈ దఫా కేవలం 1500 బస్సుల్ని మాత్రమే నడుపుతామని ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గించేశారు. ఇప్పుడు పండగకి కూడా బస్సులను పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకరకంగా ప్రయాణికులకు ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.