బీసీ సంక్రాంతి సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో.. సొంత లాభం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేసి.. అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించారని అన్నారు. తన బినామీలతో చుట్టు పక్కల భూములు కొనుగోలు చేయించారని.. ఆ కొన్న భూముల ధరలు ఎక్కడ పడిపోతాయన్న భయంతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు.