మోదీ ప్రభుత్వంని  ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయడానికి అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ, అది జరిగే అవకాశం లేదని పేర్కొంది. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందుగానే కాదనవద్దని, దయచేసి సలహాను పరిశీలించాలని చెప్పారు. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. తదుపరి విచారణ వింటర్ వెకేషన్లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్‌ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అవకాశం కల్పించారు.