అమరావతి జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్తూ చంద్రబాబు దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే దుర్గమ్మ ఆలయంలో చంద్రబాబు పూజలు చేసినా ఆయనకు శాప విమోచనం కలగదని, దుర్గమ్మ శాపంతోనే టీడీపీ గతేడాది జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైందని అన్నారు మంత్రి కొడాలి నాని. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బెజవాడ దుర్గమ్మకు ఎప్పుడూ పట్టు వస్త్రాలు సమర్పించలేదని అన్నారు మంత్రి కొడాలి నాని. పట్టు వస్త్రాలు సమర్పించకపోగా, చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు చేయించారని, అందుకే బాబుకి, ఆయన పార్టీకి దుర్గమ్మ శాపం తగిలిందని అన్నారు.