ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతోంది. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపోలకు లేదా ఆర్టీసీ యూనిట్లకు సొంత ఖర్చులతోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇన్నాళ్లకు సానుకూలంగా స్పందించింది. వీరందరికీ బస్ పాస్ లు ఇవ్వబోతోంది.