ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపేయాలని.. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసింది.