వ్యవసాయం వదులుకుని భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులు కాదని విమర్శించారు మంత్రి నాని. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని ప్రాంతంలో నిరుపేద రైతులు, బలహీనవర్గాలకు సెంటు స్థలం ఇస్తామని ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. ఎక్కడైనా రైతు సాగుకోసం పరితపిస్తాడని.. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్లు మాత్రం తమకు భూములొద్దు ప్లాట్లు కావాలంటున్నారని ఆక్షేపించారు. ప్లాట్ల విలువ పెరగాలని కోరుకునేవారు రైతులెలా అవుతారని నాని ప్రశ్నించారు.