ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలా? లేక మూడు రాజధానులు కావాలా అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలనేది చంద్రబాబు డిమాండ్. ఈ డిమాండ్ కి ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అసలు ప్రతిపక్ష నేత మాటకు విలువ ఉందా అనేది వేరే విషయం. ఇలాంటి చర్చ ఒకటి జరిగితే, ప్రజాభిప్రాయ సేకరణే జరిగితే ప్రజలంతా అమరావతికే జై అంటారనేది బాబు వాదన. అలా కాని పక్షంలో తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని ప్రకటించారు.