తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రూ.3500కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో రహదారుల నిర్మాణం కోసం ఎల్ అండ్ టి సంస్ధకు పనులు అప్పజెప్పామని, భూసేకరణ సకాలంలో జరక్కపోవడంతో ఆ సంస్థ నష్టపరిహారం అడుగుతోందని చెప్పారు. 2014లో ఎల్ అండ్ టి సంస్థకు తెలంగాణలో రహదాలు నిర్మాణ పనులు అప్పజెప్పినా, భూసేకరణ విషయంలో సీఎం కేసీఆర్ ఏడాది ఆలస్యం చేయడంతో ఇప్పుడు ఆ సంస్థ రూ.3,500 కోట్లు పరిహారం ఇవ్వాలని అడుగుతోందని అన్నారు కిషన్ రెడ్డి.