కృష్ణా జిల్లాలో రాజకీయంగా బాగా హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక్కడ నుంచి రెండు సార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, గత ఏడాది చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్కు జై కొట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, పరోక్షంగా జగన్కు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వంశీ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా నడుచుకుంటున్నారు.