ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువనాయకులు చాలామందే ఉన్నారు. అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టీడీపీలో పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు. తమ పార్టీకి అండగా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు చూపించే నాయకులకు కొదవ లేదు. అలా రాష్ట్రంలో మంచి క్రేజ్ నాయకుల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు. దివంగత ఎర్రన్నాయుడు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్, 2014 ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.