దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకు వెళ్లే తీరిక ఉన్న పవన్ కల్యాణ్ కి.. ఏపీలో అమరావతి ప్రజల కష్టాలు పట్టలేదా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గతంలో కూడా పవన్ సినిమాల జోలికి వెళ్లారంటే ఇక జనాలను పట్టించుకోరని, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషయన్ అనే విమర్శలు వినిపించాయి. తాజాగా రణభేరికి రాకుండా పవన్, నిర్మతా దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే సరికి మరోసారి విమర్శకులు తమ నోటికి పని చెప్పారు.