ఆరు నూరైనా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాల్సిందేనంటూ పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. హైకోర్టు వేదికగా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. అటు ప్రభుత్వం కూడా ఎన్నికలు జరిపేందుకు ససేమిరా అంటూ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఈ దశలో ఏకంగా ఇద్దరు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి సంచలనం సృష్టించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.