ఈ నెల 25 నుంచి 15 రోజులపాటు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపట్టాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి ఊరికి వెళ్లి పట్టాలు నేరుగా ప్రజలకు అందివ్వాలని సూచించారు సీఎం జగన్. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గ్రామాల్లో ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ఇదో మంచి అవకాశం అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులతో ఈ విషయాన్ని చర్చించారు.