రాజధాని అమరావతిపై రెఫరెండం పెట్టండి, అందరూ రాజీనామాలు చేసి మరోసారి ఎన్నికల రణ క్షేత్రానికి రండి అంటూ పదే పదే సవాళ్లు విసురుతున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, వైసీపీ నేతలు మాత్రం తమ సొంత లాభం కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారనేది ఆయన వాదన. అయితే రెఫరెండం, రెఫరెండం అంటూ పదే పదే సవాళ్లు విసురుతున్న చంద్రబాబుకి వైసీపీ నేతలు ఝలక్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాలంటూ ప్రతి సవాల్ విసిరారు.