గ్రేటర్ ఎన్నికల బరిలో జరిగిన తప్పుల్ని సీఎం కేసీఆర్ సరిదిద్దుకుంటున్నారు. హైదరాబాద్ వరదసాయం పంపిణీ విషయంలో ఎన్నికల కోడ్ అడ్డు రావడం టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టింది. నెపం బీజేపీపైకి నెట్టాలని చూసినా కూడా ప్రజలు అంగీకరించలేదు. వరద సాయం అందకపోవడంతో పేదలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఈసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని భావిస్తున్నారు కేసీఆర్.