తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే, ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు గుర్తొస్తారు. ఒకప్పుడు టీడీపీలో కీలకపాత్ర పోషించి చంద్రబాబుకు కుడిభుజంగా నడుచుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఓ సీఎం అభ్యర్ధిగా ఎదిగారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అతి పెద్ద నాయకుడుగా ఉన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.