ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చాలా సీనియర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ వ్యూహాలకు ప్రత్యర్ధులు చిత్తు అవ్వాలసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు జరిగింది. కానీ జగన్ ఎంట్రీ ఇచ్చాక, బాబు పప్పులు ఉడకడం లేదు. అలా అని చంద్రబాబు ఏమి లైట్ తీసుకోవడం లేదు. ఎలాగైనా జగన్కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ముందుకెళుతూనే ఉన్నారు. అధికారం ఒక్కసారిగా కోల్పోవడంతో జగన్ టార్గెట్గా బాబు చేసే రాజకీయాలు మామూలువి కాదు.