2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు చాలామంది టీడీపీ సీనియర్ నాయకులు చాప చుట్టేసిన విషయం తెలిసిందే. ఓటమి ఎరుగని మహామహులు సైతం మట్టి కరిచారు. ఇక ఓడిపోయాక కూడా బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అసలు చాలామంది నేతలు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడుప్పుడే కొందరు లైన్లోకి వచ్చి అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. నిదానంగా ఒక్కో నేత యాక్టివ్ అవుతున్నారు.