అప్పులు ఇప్పించడంలో ఏపీ సీఎం జగన్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇదేదో రాష్ట్రం కోసం ప్రభుత్వం చేసిన అప్పు అని పొరపడొద్దు. ఏపీలోని వివిధ వర్గాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలో జగన్ కి దక్కిన క్రెడిట్ ఇది. అందులోనూ ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలో జగన్ సర్కారు రికార్డు తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశారు. ఈ మొత్తం రూ.77,650కోట్లుగా పేర్కొంది నాబార్డు.