అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజధాని పోరాటానికి అసలు సిసలు పోటీ మొదలైంది. ఇన్నాళ్లూ అమరావతిలో అందరికీ భూములు ఇవ్వాలంటూ టెంట్లు వేసుకుని దీక్షలు చేసిన బహుజన పరిరక్షణ సమితి సంఘాలు రోడ్డెక్కాయి. చంద్రబాబు విధానాలకి వ్యతిరేకంగా ఉద్యమాన్నిఉధృతం చేస్తున్నాయి. ఇటీవలే అమరావతి రాజధాని ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ ప్రదర్శన, సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు కూడా తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.