కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షల్లో జాతీయ స్థాయిలో నెంబర్ 1 స్థానాన్ని పొందింది ఆంధ్రప్రదేశ్. వ్యాధి విజృంభణ అధికంగా ఉన్న రోజుల్లో.. రోజువారీ పరీక్షల్లో కొన్ని నెలలపాటు ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. కేసుల సంఖ్య తగ్గిపోతున్న దశలో.. ఇప్పుడు పరీక్షల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు టీకా వస్తే.. పంపిణీ విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది.