కొత్త ఏడాదికి ముందే హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి తొలి వారం నుంచే ఉచిత నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచే 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోబోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.