సీఎం జగన్ పరిపాలన అంటే ముందుగా గుర్చొచ్చేవి నవరత్నాల పథకాలు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలులో పెట్టి తనేంటో నిరూపించుకున్నారు జగన్. అయితే నవరత్నాలను మించిపోయేలా ఇప్పుడు కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు. జగన్ పేరుని చరిత్రలో నిలిపేలా ఈ నూతన కార్యక్రమం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వందేళ్ల చరిత్రను జగన్ తిరగరాయాలనుకోవడమే దీనికి కారణం.