ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏవైతే హామీలను ఇచ్చారో... ప్రతి ఒక్కటి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మనసును సొంతం చేసుకున్నారు. పదవిలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం లోనే దాదాపు 90 హామీలన్నీ నెరవేర్చి ప్రజా పాలనకు సమర్థవంతమైన నాయ కుడిగా... రారాజు గా కీర్తి ప్రతిష్టలు పొందారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటు ఆయన అభిమానులు, అటు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు ఆయనకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమయ్యారు.