ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ ఎలాంటి ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. అయితే ఆ ఎన్నికలని నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని చెప్పేస్తున్నారు. ఇక నిమ్మగడ్డ రమేష్, వైసీపీ ప్రభుత్వం మధ్య ఉన్న పంచాయితీ ఏంటో అందరికీ తెలిసిందే.