తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నందమూరి-నారా కుటుంబాల పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. ఈ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి దివంగత ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి, రెండు సార్లు ఉమ్మడి ఏపీ, ఒకసారి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నాయకుడుగా చేశారు. ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు.