నెల్లూరు టీడీపీ ఆఫీసులో జగన్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ నేతలు ఇసుకతో తయారు చేసిన కేక్ కట్ చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హ్యాపీ బర్త్ డే ‘ఇసుక రాజా’ అంటూ సీఎం జగన్పై ఓ రేంజ్లో సెటైర్లు వేశారు.