జనవరి 1నుంచి ఏపీలో ట్రాఫిక్ చలాన్ల బాదుడు భారీ స్థాయిలో మొదలవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులకు జారీ చేసింది రవాణా శాఖ. బైక్ తీసినా, కారు తీసినా.. రోడ్డుపైకి వెళ్లాలంటే పర్మిషన్, డ్రైవింగ్ లైసెస్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. వీటిలో ఏదీ లేకపోయినా చలాన్ పడిపోతుంది. మీరు ప్రెస్సా, పోలీసా, డాక్టరా, లాయరా.. ఇలాంటివేవీ పట్టించుకోరు. రికమండేషన్లు పనిచేయవు. చలాన్ రాయించుకుని వెళ్లాల్సిందే, లేకపోతే ఆన్ లైన్లో కట్టుకోవాల్సిందే. కరోనా కారణంగా ఇప్పటి వరకూ కాస్త లిబరల్ గా ఉన్నా.. జనవరి 1నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.