సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెప్పారు, పవన్ కల్యాణ్ మాత్రం తన అహంభావం ప్రదర్శించారంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలు వండి వార్చాయి. జగన్ కు పవన్ విషెస్ చెప్పలేదని, జగన్ పై పవన్ కి ఉన్న జలసీకి అదే నిదర్శనమంటూ పెద్ద పెద్ద మాటలు అందులో కనిపించాయి. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.. జనసేన తరపున పవన్ కల్యాణ్ పేరుతో సీఎం జగన్ కి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తన విషెస్ ని తెలిపారు.