రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ జాబితా అందుబాటులో ఉంది. అయితే ప్రాథమిక జాబితాలో పేర్లు లేనివాళ్లు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారికి మరో అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేరు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.