తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్టు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ వరాన్ని వీలైనంత త్వరగా అమలులో పెడతామని కేటీఆర్ కూడా తేల్చి చెప్పారు. ఎన్నికల కోడ్ కూయకముందే నియామక ప్రక్రియ మొదలు పెడతామన్నారు. అయితే టీచర్ పోస్ట్ ల భర్తీ విషయంలో మాత్రం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో జరుగుతున్న కార్యక్రమం వల్ల ఉపాధ్యాయ పోస్ట్ ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. టీచర్ పోస్ట్ ల భర్తీకోసం ఎదురు చూస్తున్న బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది.