ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆధార్ వివరాలు సేకరించొద్దంటూ ఓవైపు హైకోర్టు స్పష్టం చేసినా.. కేసీఆర్ సర్కారు మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. ప్రభుత్వం తరపున తమ వాదన వినిపిస్తూ మరోసారి కోర్టు మెట్లెక్కారు అధికారులు. ధరణిలో వ్యవసాయ ఆస్తుల మనోదుకి ఆధారం, కులం వివరాలు అడగొద్దంటూ నవంబర్ 3న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయాలంటూ కోరారు.