ఇప్పటివరకు కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు గజగజ వణికి పోతున్నాయి. ఆర్థిక పరిస్థితి చతికిలపడింది. ప్రపంచ దేశ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఈ కరోనా వైరస్. లాక్ డౌన్ పేరిట ఎక్కడా సందడి లేకుండా పోయింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఇటు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చాయి.