గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...ప్రస్తుతం ఓ రాజకీయ విశ్లేషుకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అలాగే ఓ క్రిటిక్‌గా మారారు. గత చంద్రబాబు ప్రభుత్వం సమయంలో అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి, ప్రభుత్వం తప్పొప్పులని చెప్పేవారు.