జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అలా అని రాజకీయాలని వదిలిపెట్టకుండా తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అయితే ఇలా చేయడం వల్లే జనసేన ఇంకా పుంజుకోలేకపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో ఫుల్ క్రేజ్ ఉన్న పవన్ జనసేన పార్టీ పెట్టి, పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్, ఆ సమయంలో కూడా ఫుల్ టైమ్ రాజకీయాల్లో కనిపించలేదు.