భారత్ లో కొత్తరకం కొవిడ్ కేసులు లేవని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతున్నా కూడా.. ప్రజల్లో భయాందోళనలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ నుంచి వస్తున్న వారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం, ఆ వైరస్ కొత్తరకమా లేదా అని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో మొత్తం 25మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేదంటే పాతదేనా అనే సంగతి నిర్ధరించడానికి అయా రాష్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణె లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.