టీడీపీ చంద్రబాబు అధీనంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి ఎన్నికల్లోనూ ఆయన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటూనే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు, జనసేన.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ మినహా బాబు పొత్తు పెట్టుకోకుండా మిగిలిపోయిన పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బాబు పొత్తులేకుండా పోయి చిత్తయిపోయారు. ఈ సారి అలాంటి ప్రమాదం లేకుండా ముందస్తుగానే పొత్తులకోసం సిద్ధమవుతున్నారు. కుదిరితే బీజేపీ, జనసేన రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని.. వైసీపీని ఏకాకిని చేయాలనేది బాబు ప్లాన్. 2014లో అదే జరిగింది. కానీ 2019లో ముగ్గురూ విడిపోయే సరికి వైసీపీ ఘన విజయం సాధించింది. అందుకే 2024 ఎన్నికల టైమ్ కి లేదా జమిలి ఎన్నికలు వస్తే ఆ సమయానికైనా సిద్ధంగా ఉండాలనేది బాబు ప్లాన్.