గతంలో ప్రతి కుటుంబానికి, లేదా కొన్ని కుటుంబాలకు కలిపి ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. అంటే.. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే.. కబురు పెడితే వెంటనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసేవారు. పాత సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి సీన్లు కనిపించేవి. ఇప్పుడీ ఫ్యామిలీ డాక్టర్ విధానం కనుమరుగైంది. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పరుగులుపెడుతున్నారు జనం. రకరకాల టెస్ట్ ల పేరుతో వారిని పీల్చి పిప్పిచేస్తున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఇకపై ఏపీలో కూడా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి తేవాలనుకుంటున్నారు సీఎం జగన్. విలేజ్ క్లినిక్ ల ద్వారా ఇది సాధ్యమవుతుందని అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారాయన.