విద్యాకానుక పంపిణీ విషయంలో వచ్చిన విమర్శలపై సీఎం జగన్ అధికారులను వివరణ అడిగినట్టు తెలుస్తోంది. ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, షూ, టై, బెల్ట్, బ్యాగ్ ఇచ్చారు. అయితే కొన్నిచోట్ల ఇలా పంపిణీ చేసిన వస్తువుల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాగుల నాణ్యత బాగో లేదని, షూ సైజ్ లు సరిపోలేదని కంప్లయింట్ లు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా దీనిపై రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి తప్పులు జరగకూడదని అధికారులకు సూచించారట సీఎం జగన్.