అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జేసీ ఫ్యామిలీ కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి తిరుగులేని విజయాలు సాధించారు. తెలుగుదేశం హవా ఉన్న సమయాల్లో సైతం కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. వరుసగా 1985, 1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, దివాకర్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి విజయం సాధించారు.