గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. శిక్షణ పూర్తయిన తర్వాత శాఖాపరమైన పరీక్ష నిర్వహించాలన్నారు. ఇందులో క్వాలిఫై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్ పూర్తవుతుందని వెల్లడించారు. ఇందు కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయి అగ్రికల్చర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు.