కరోనా రూపాంతరంగా పిలుస్తున్న స్ట్రెయిన్ దానికంటే మరింత ప్రమాదకారి అని, మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా టీకా కూడా దాన్ని ఎదుర్కోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు కొత్తరకం కరోనా అనే వార్త బైటకు రాగానే.. దానిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాస్తవాలు అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా స్ట్రెయిన్ పై వచ్చే పుకార్లతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారే మాట మాత్రం వాస్తవం.