డిసెంబర్ 30, 31, జనవరి 1న ఏపీలో మూడు రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ మూడు రోజులపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, షాపులు తెరవకూడదని, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించి పోతాయని వార్తలొచ్చాయి. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆశలు పెట్టుకున్న వ్యాపార వర్గాలు వణికిపోయాయి. కొత్త సంవత్సరం అంటే.. పూల బొకేలు, దండలు, కేకులు, స్వీట్లు వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక మద్యం సంగతి చెప్పేదేముంది. వీరంతా లాక్ డౌన్ వార్తలతో అల్లాడిపోయారు. తమ వ్యాపారం పడిపోతుందని టెన్షన్ పడిపోయారు.