గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిపై ఇప్పటికే పలు చోట్ల ఫిర్యాదులొస్తున్నా.. శాఖాపరమైన విచారణతో సరిపెడుతున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో వీరిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్న 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇప్పుడు సచివాలయ సిబ్బంది పనితీరు మదింపు చేయబోతున్నారు. సిబ్బంది పనితీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న వారు ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు చెప్పొచ్చని, సిబ్బంది పనితీరు నచ్చకపోతే నిర్మొహమాటంగా కంప్లయింట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్.. సచివాలయ సిబ్బంది పనితీరుని 1902 నెంబర్ కి కాల్ చేసి చెప్పాలని సూచించారు. ప్రతి సచివాలయంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను డిస్ ప్లే చేయాలని అధికారులను ఆదేశించారు.