తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో భక్తులను దర్శనాలకు రానీయకుండా అడ్డుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు. లాక్ డౌన్ కాలంలో భక్తులు పరిస్థితి అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు కనీసం కొండపైకి కూడా పోనీయకుండా భక్తుల్ని కిందే ఆపేస్తున్నారు సిబ్బంది. దీంతో తిరుపతి మెట్ల మార్గం వద్ద.. ఇతర ప్రాంతాల్లో భక్తుల ఆందోళనలు మిన్నంటాయి. కేవలం టోకెన్లు లేవనే కారణంతో తమను కిందే ఆపేస్తున్నారని, దూర ప్రాంతాలనుంచి వచ్చినవారిపై కనికరం చూపాలని వేడుకుంటున్నారు భక్తులు.