స్థానిక ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు తాజాగా ఇచ్చిన సూచన.. ఎన్నికల కమిషన్ కి అనుకూలం అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తలుపు తట్టాలా లేక, అధికారుల బృందాన్ని చర్చలకు పంపాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నా.. ఇప్పటి వరకూ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.