రాజకీయాలకు దూరమై రాజకీయ విశ్లేషుకుడిగా మారిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని బీజేపీ టార్గెట్ చేసింది. అలాగే అధికార వైసీపీ కూడా ఆయన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మామూలుగానే టీడీపీ నేతలు ఉండవల్లిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉండవల్లి, వైసీపీ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినట్లు ఇచ్చి విమర్శలు చేశారు.ఇదే సమయంలో ఉండవల్లి బీజేపీపై విరుచుకుపడ్డారు.