ఏపీలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. 2019 ఎన్నికల తర్వాత జరగబోయే ఉపఎన్నిక కావడంతో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తమ ఆధిక్యం తగ్గలేదని చూపించాలని వైసీపే చూస్తుంటే, తిరుపతి స్థానంలో గెలిచి ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకిత పెరిగిందనే విషయాన్ని తెలియజేయాలని టీడీపీ చూస్తుంది.