ఏపీ పోలీసులపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్నేహలత హత్య కేసు విషయపై స్పందించిన పవన్.. పోలీస్ వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. ఏపీ పోలీస్ వ్యవస్థ బాధ్యతా రాహిత్యం వల్లే స్నేహలత ఉదంతం జరిగిందని అన్నారు పవన్ కల్యాణ్. గతంలో విజయవాడ, విశాఖలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడీ దుర్మార్గం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.